భారత మార్కెట్లోకి ‘పోకో ఎం2 ప్రొ’.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

ABN , First Publish Date - 2020-07-08T02:08:21+05:30 IST

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో మంగళవారం భారత మార్కెట్లోకి ‘పోకో ఎం2 ప్రొ’ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర

భారత మార్కెట్లోకి ‘పోకో ఎం2 ప్రొ’.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో మంగళవారం భారత మార్కెట్లోకి ‘పోకో ఎం2 ప్రొ’ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 13,999 మాత్రమే. ఈ రోజు జరిగిన వర్చువల్ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘పోకో ఎం2 ప్రొ’ మూడు వేరియంట్లలో వస్తోంది. 4జీబీ/64 జీబీ, 6జీబీ/64 జీబీ, 6జీబీ/128 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ మోడల్ ధర రూ. 13,999. రెండో వేరియంట్ దర రూ. 14,999 కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 16,999 మాత్రమే. ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్ ప్రారంభం కానుంది. 


స్పెసిఫికేషన్లు:  సైమెట్రికల్ డిజైన్‌ పోకో ఎం2 ప్రొ ప్రత్యేకత. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉన్నాయి. 


Updated Date - 2020-07-08T02:08:21+05:30 IST