ఘనంగా పోచమ్మ బోనాలు

ABN , First Publish Date - 2020-07-13T11:02:14+05:30 IST

పట్టణంలోని స్థానిక ధరూర్‌ క్యాంప్‌లోగల జానకీ రామ నగర్‌, అపార్ట్‌మెంట్‌ మహిళల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా..

ఘనంగా పోచమ్మ బోనాలు

జగిత్యాల అర్బన్‌, జూలై 12: పట్టణంలోని స్థానిక ధరూర్‌ క్యాంప్‌లోగల జానకీ రామ నగర్‌, అపార్ట్‌మెంట్‌ మహిళల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని అచ్చుబండ పోచమ్మ ఆలయం వరకు బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంత రం ఆలయానికి చేరుకుని, తమతో తెచ్చిన గు ఢానాన్ని అమ్మవారికి నైవేద్యం గా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి బల్దియా ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, స్థానిక కౌ న్సిలర్‌ వోద్ది శ్రీలత రామ్మోహన్‌ రావు ముఖ్య అ తిథిగా హాజరయ్యి, మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ బోనాలతో క్యాంప్‌లో సందడి వాతావర ణం నెలకొంది. ఈ బోనాల కార్యక్రమంలో స్థాని కులు రాజేశ్వర్‌ రావు, రవీంధర్‌ రావు, సతీష్‌ రా వు, నరేష్‌, సతీష్‌, మల్లిఖార్జున్‌, రామాంజ నేయు లు,  రాధాకృష్ణ ఉన్నారు.


మొక్కలు నాటిన ఛైర్‌పర్సన్‌ శ్రావణి

పట్టణంలోని ధరూర్‌ క్యాంప్‌ 9వ వార్డులో అ చ్చుబండ పోచమ్మ తల్లీ బోనాల సందర్భంగా స్థానిక  మహిళలతో కలిసి బల్దియా ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, స్థానిక కౌన్సిలర్‌ వోద్ది శ్రీలత లు ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగం గా మొక్కలు నాటి, వాటిని పరిరక్షించాలని కోరారు.


ధర్మపురిలో ఘనంగా పోచమ్మ బోనాలు

ధర్మపురి, జూలై 12: ధర్మపురి పట్టణంలో పోచమ్మ బోనాలు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్నూరుకాపు, ఇతరత్రా కుల సంఘాల ఆధ్వర్యంలో సారుగమ్మవీధి, సంగివాడ, తోట్లవాడ, కాశెట్టివాడ, మేదరివాడ, దుర్గమ్మ కాలనీ నుంచి వేర్వేరుగా అనేక మంది మహిళలు భౌతిక దూరం పాటించి నెత్తి మీద బోనాలు పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగిం పుగా సమీపంలో గల పెద్ద పోచమ్మ, ముత్యాల పోచమ్మ, ఊర పోచమ్మ, నల్ల పోచమ్మ ఆలయాలకు చేరుకున్నారు.


అనంతరం అమ్మవారలకు పసుపు, కుంకుమ చల్లి, నైవేద్యం సమర్పించారు. అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. తమ కుటుంబం క్షేమంగా ఉండాలని, వర్షాలు విస్తారంగా కురియాలని కోరుతూ చల్లగా దీవించమ్మా తల్లీ అంటూ వేడుకున్నారు. మేకలు, కోళ్లు బలి ఇచ్చి అక్కడే వంటలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు అందరు కలిసి భోజనాలు చేసి రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. అలాగే మండలంలోని అనేక గ్రామాల్లో పోచమ్మ బోనాలు వేడుకలు నిర్వహించారు.

Updated Date - 2020-07-13T11:02:14+05:30 IST