న్యూఢిల్లీ : ఏటీఎం లావాదేవీల ఛార్జీల కింద ప్రభుత్వరంగ పీఎన్బీ(పంజాబ్ నేషనల్ బ్యాంక్) రూ. 645 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆర్టీఐ కింద దాఖలైన ఓ పిటిషన్‌కు ఇచ్చిన సమాధానంలో పీఎన్బీ ఈ వివరాలను వెల్లడించింది. కిందటి(2021-22) ఆర్థిక సంవత్సరంలో ఏటీఎం ఛార్జీల కింద రూ. 645.67 కోట్ల మొత్తాన్ని పీఎన్బీ వసూలు చేసింది. అంతేకాకుండా... ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్‌లను నిర్వహించని కస్టమర్ల నుంచి రూ. 239.09 కోట్లను వసూలు చేసింది.
కిందటి(2020-21) ఆర్థిక సంవత్సరంలో కస్టమర్లు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్‌లను మెయింటైన్ చేయనందుకుగాను... ఈ బ్యాంకు వసూలు చేసిన ఛార్జీలు రూ. 170 కోట్లు కాగా, ఈ ఏడాది ఈ ఛార్జీలు భారీగా పెరిగాయి. మొత్తం 85,18,953 ఖాతాలనుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు PNB వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 6,76,37,918 ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా ఉన్నట్టు బ్యాంకు వెల్లడించింది. ఇక... 2018-22 మధ్య కాలంలో పీఎన్బీలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు పెరుగుతూ రావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి