ఘనంగా ‘పీఎన్‌బీ’ డిజిటల్‌ అప్నాయన్‌ డే

ABN , First Publish Date - 2020-10-23T10:03:38+05:30 IST

దేశంలోనే పేరుగాంచిన బ్యాంకుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) డిజిటల్‌ అప్నాయన్‌ డేను గురువారం ఘనంగా నిర్వహించింది

ఘనంగా ‘పీఎన్‌బీ’ డిజిటల్‌ అప్నాయన్‌ డే

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే పేరుగాంచిన బ్యాంకుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) డిజిటల్‌ అప్నాయన్‌ డేను గురువారం ఘనంగా నిర్వహించింది. 45 రోజుల్లో 5 లక్షల నూతన ఖాతాదారులకు 8 లక్షల డిజిటల్‌ చెల్లింపులను చేసింది. గత ఆగస్టు 15న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ సీహెచ్‌ఎ్‌సఎస్‌ మల్లికార్జున్‌రావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. డిజిటల్‌ అప్నాయన్‌ డేను పురస్కరించుకుని ముషీరాబాద్‌ బ్రాంచిలో జరిగిన కార్యక్రమంలో జీఎం, తెలంగాణ, ఏపీ, కర్ణాటక జోనల్‌ హెడ్‌ అషుతోష్‌ చౌదరి మాట్లాడుతూ.. దేశంలోని 10,931 బ్రాంచిల్లో ప్రయోగాత్మకంగా క్యాంపెయిన్‌ నిర్వహించామన్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పీఎం కేర్‌ నిధికి రూ. 40 లక్షలకు పైగా అందజేసిందన్నారు. కార్యక్రమంలో సర్కిల్‌ హెడ్‌ వినాయక్‌ కుమార్‌ సర్దే్‌షపాండే, బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T10:03:38+05:30 IST