విజయవాడ అగ్నిప్రమాద ఘటన బాధితులకు కేంద్రం పరిహారం

ABN , First Publish Date - 2020-08-10T01:27:15+05:30 IST

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన బాధితులకు కేంద్రం పరిహారం ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రకటించింది.

విజయవాడ అగ్నిప్రమాద ఘటన బాధితులకు కేంద్రం పరిహారం

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన బాధితులకు కేంద్రం పరిహారం ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రకటించింది. ఘటన గురించి తెలియగానే ప్రధాని మోదీ ఏపీ సీఎం జగన్‌‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఆయన కేంద్రం ఆదుకుంటుందని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రదాని ఆకాంక్షించారు.


మరోవైపు బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. 


స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో మరణాల సంఖ్య పదికి పెరిగింది. ఇప్పటికే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది.  


స్వర్ణ ప్యాలెస్‌ను అధికారులు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్నారు. ఈ ఉదయం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పొగవల్ల ఊపిరాడక ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. 



Updated Date - 2020-08-10T01:27:15+05:30 IST