‘నీట్‌’ మినహాయింపునకు చర్యలు చేపట్టండి

ABN , First Publish Date - 2022-07-02T14:48:45+05:30 IST

‘నీట్‌’ మినహాయింపు తీర్మానం ఆమోదం పొందేలా సత్వర చర్యలు చేపట్టాలని పీఎంకే అధ్యక్షుడు డా.అన్బుమణి రాందాస్‌ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా

‘నీట్‌’ మినహాయింపునకు చర్యలు చేపట్టండి

                            - పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి


ప్యారీస్‌(చెన్నై), జూలై 1: ‘నీట్‌’ మినహాయింపు తీర్మానం ఆమోదం పొందేలా సత్వర చర్యలు చేపట్టాలని పీఎంకే అధ్యక్షుడు డా.అన్బుమణి రాందాస్‌ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, 2022-23 విద్యా సంవత్సరం వైద్యకోర్సుల్లో విద్యార్థుల అడ్మిషన్లకు నిర్వహించే నీట్‌ పరీక్ష ఈ నెల 17వ తేదీ జరుగనుందన్నారు. ఆ పరీక్షలో పాస్‌ అవుతానో లేదోనన్న భయంతో చూలైమేడుకు చెందిన ధనుష్‌ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం ఆవేదన కలిగించిందన్నారు. నీట్‌కు ముందే ఆత్మహత్య సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరీక్ష నుంచి మినహాయింపు వార్త మాత్రమే విద్యార్థులకు ఊరట కలిగిస్తుందని, రాష్ట్రప్రభుత్వం ఆమోదించిన నీట్‌ మినహాయింపు తీర్మానం కేంద్రప్రభుత్వానికి పంపి 60 రోజులు దాటినా, ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందేలా చర్యలు చేపట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి నీట్‌ మినహాయింపు తీర్మానం ఆమోదం పొందేలా చర్యలు చేపట్టాలని డా.అన్బుమణి డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-07-02T14:48:45+05:30 IST