పొగాకు ఉత్పత్తులను నిరోధించేదెప్పుడు ?

ABN , First Publish Date - 2022-06-01T14:20:36+05:30 IST

ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా క్యాన్సర్‌ అధికమవుతోందని, అయినా వాటిని నిరోధించడంలో పాకులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని

పొగాకు ఉత్పత్తులను నిరోధించేదెప్పుడు ?

                      - అన్బుమణి ఆగ్రహం


ప్యారీస్(చెన్నై): ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా క్యాన్సర్‌ అధికమవుతోందని, అయినా వాటిని నిరోధించడంలో పాకులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని పీఎంకే అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ అన్బుమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా మంగళవారం ఉద్దండిలోని జయా గ్రూప్‌ రాగాస్‌ దంతవైద్య కళాశాల ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ ఉద్దండి నుంచి అక్కరై వరకు కొనసాగింది. ఈ ర్యాలీని ప్రారంభించిన అనంతరం అన్బుమణి మాట్లాడుతూ... ప్రపంచ పొగాకు వ్యతిరేకదినం సందర్భంగా నిర్వహించే అవగాహనా ర్యాలీల్లో పాల్గొంటున్న ప్రజలు ధూమపానం, మాదకద్రవ్యాల అలవాటు నుంచి దూరం కావాలని పిలుపునిచ్చారు. పొగాకు వినియోగం వల్ల దుష్ఫలితాలపై అవగాహన కల్పిస్తూ సాగిన ఈ ర్యాలీలో పలువురు కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థినులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-01T14:20:36+05:30 IST