Abn logo
Sep 18 2020 @ 16:44PM

పుణెలో 4 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకల పెంపు

Kaakateeya

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. పుణెలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పుణె మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న డిమాండ్ మేరకు నాలుగు పౌర ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకల సంఖ్యను పెంచాలని పుణె మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. నాయుడు ఆస్పత్రి, దాల్వి ఆస్పపత్రిలో ఆక్సిజన్ పడకలు ఉన్నాయని పీఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ కందుల్ అన్నారు. ఖేదేకర్ ఆస్పత్రిలో ప్రస్తుతం 40 ఆక్సిజన్ బెడ్స్ ఉండగా, 100 నుంచి 115కి పెంచనున్నారు. లేగూడ్ ఆస్పత్రిలో ఇప్పుడు 30 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement