విలీన ప్రయత్నాల్లో పీఎంసీ బ్యాంక్‌

ABN , First Publish Date - 2020-09-17T06:22:49+05:30 IST

పీఎంసీని ఇతర బ్యాంక్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే పలు ప్రముఖ బ్యాంక్‌లను సంప్రదించినట్లు ఢిల్లీ హైకోర్టుకు అడ్మినిస్ట్రేటర్‌ వెల్లడించారు...

విలీన ప్రయత్నాల్లో పీఎంసీ బ్యాంక్‌

  • పలు ప్రముఖ బ్యాంక్‌లతో సంప్రదింపులు 


ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్‌లో భారీ కుంభకోణం వెలుగు చూ సి ఏడాది పూర్తికావస్తున్నా ఇప్పటికీ ఈ సంక్షోభానికి పరిష్కారం లభించలేదు. భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడిన పీఎంసీ బ్యాంక్‌ మాజీ బోర్డును 2019 సెప్టెంబరులో ఆర్‌బీఐ రద్దు చేసింది. బ్యాంక్‌ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం అడ్మినిస్ట్రేటర్‌ను నియమించింది. పీఎంసీని ఇతర బ్యాంక్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే పలు ప్రముఖ బ్యాంక్‌లను సంప్రదించినట్లు ఢిల్లీ హైకోర్టుకు అడ్మినిస్ట్రేటర్‌ వెల్లడించారు. అయితే, సంప్రదించిన బ్యాంక్‌ల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. పీఎంసీ బ్యాంక్‌ మాజీ యాజమాన్యం నిబంధనలను తుంగలో తొక్కి హెడీఐఎల్‌ అనే రియల్టీ కంపెనీకి వేల కోట్ల రుణాలిచ్చి చిక్కుల్లో పడింది.

Updated Date - 2020-09-17T06:22:49+05:30 IST