ఇళ్లు 16,069

ABN , First Publish Date - 2022-09-24T05:11:53+05:30 IST

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజ న (పీఎంఏవై) గ్రామీణ్‌కు సంబంధించి జిల్లాకు 16,069 ఇళ్లు మంజూరయ్యాయి.

ఇళ్లు 16,069

 పీఎంఏవైలో ఇప్పటికే 10,892 ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ 

7,307 ఇళ్లకు పూర్తయిన జియోట్యాగింగ్‌ 

ఏలూరుసిటీ, సెప్టెంబరు 23: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజ న (పీఎంఏవై) గ్రామీణ్‌కు సంబంధించి జిల్లాకు 16,069 ఇళ్లు మంజూరయ్యాయి. 2017లో నిర్వహించిన ఆవాస్‌ ప్లస్‌ డేటా ప్రకారం ఈ పథకంలో ఇళ్లు నిర్మించుకునేందుకు దాదాపు 27 వేల మందిని అర్హులుగా గుర్తించారు. ఇప్పుడు పీఎంఏవై గ్రామీ ణ్‌ కింద జిల్లాకు 16,069 ఇళ్లు కేటాయించింది. ఈ పథకానికి అర్హులైన వారిలో ఇప్పటికే 3,139 మంది ఇళ్లు సొంతంగా నిర్మించుకున్నారు. లబ్ధిదారులకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ పథకంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్షా 80 వేల రూపా యలు నిధులు కేటాయించారు. వీటిలో కేంద్రం వాటా రూ.72 వేలు, రాష్ట్రం వాటా రూ.48 వేలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబం ధించి అడిషినల్‌ వాటా రూ.30 వేలు కాగా, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రూ.30 వేలు కేటాయించనున్నారు.   

 గ్రామీణ్‌ ఇళ్ల కేటాయింపు..

ఆవాస్‌ ప్లస్‌ డేటా ప్రకారం జిల్లాలో 16,069 మందికి ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటికే 10,892 ఇళ్ల నిర్మాణానికి సంబం ధించి లబ్ధిదారుల రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. ఇంకా 5,177 మం దికి రిజిస్ట్రేషన్‌ జరగాల్సి ఉంది. 7,307 ఇళ్ల నిర్మాణానికి జియో ట్యాగింగ్‌ ప్రక్రియ పూర్తి కాగా  3,585 ఇళ్లకు జియో ట్యాగింగ్‌ పూర్తిచేయాల్సి ఉంది. మండలాల వారీగా అర్హుల జాబితా ఇలా.. పెదవేగి 784, దెందులూరు 803, పెదపాడు 875, ద్వారకాతిరుమల 1,123, కామవరపుకోట 654, లింగపాలెం 1275, జంగారెడ్డిగూడెం 614, చింతలపూడి 1273, కొయ్యలగూ డెం 1423, టి.నరసాపురం 1091, బుట్టాయగూడెం 1,682, ఏలూరు 338, ఆగిరిపల్లి 344, పోలవరం 829, నూజివీడు 187, జీలుగుమిల్లి 690, ఉంగుటూరు 96, భీమడోలు 63, కైకలూరు 57, నిడమర్రు 80, ముసునూరు 603, గణపవరం 62, ముదినేపల్లి 30, కుక్కునూరు 46, వేలేరుపాడు 159, మండవల్లి 8, చాట్రాయి మండలానికి 880 ఇళ్లు కేటాయించారు.  

 త్వరితగతిన ఇళ్లు పూర్తి చేస్తాం

జిల్లాలో పీఎంఏవై గ్రామీణ్‌ పథకంలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాం. ఈ పథకంలో ఇప్పటికే 3,139 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా సత్వరమే పూర్తి చేస్తాం. 

– టి.వేణుగోపాల్‌, జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌




Updated Date - 2022-09-24T05:11:53+05:30 IST