ఆసీస్ పార్లమెంట్ భవనంలో లైంగిక కార్యకలాపాలు.. వీడియోలు, ఫొటోలు లీక్

ABN , First Publish Date - 2021-03-23T18:42:54+05:30 IST

ఆస్ట్రేలియా పార్లమెంటు భవనంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు లైంగిక కార్యకలాపాలకు పాల్పడిన వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ చర్యలకు ఉపక్రమించారు.

ఆసీస్ పార్లమెంట్ భవనంలో లైంగిక కార్యకలాపాలు.. వీడియోలు, ఫొటోలు లీక్

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పార్లమెంటు భవనంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు లైంగిక కార్యకలాపాలకు పాల్పడిన వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ చర్యలకు ఉపక్రమించారు. సదరు ప్రభుత్వ సిబ్బందిని తొలగించినట్లు తాజాగా ప్రధాని ధృవీకరించారు. నలుగురు ప్రభుత్వ సిబ్బందితో పాటు కొంతమంది ఎంపీలు సైతం తరచూ పార్లమెంట్ భవనంలోని ప్రేయర్ రూమ్‌ను లైంగిక కార్యకలాపాలకు ఉపయోగించడం ఓ విజిల్ బ్లోయర్ బయటపెట్టారు. దీంతో వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోమవారం రాత్రి ఆసీస్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. ఈ చర్యలను తీవ్రంగా ఖండిచిన ప్రధాని ఈ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిలో భాగంగా కొంతమందిని విధుల నుంచి తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు.


ప్రధాని మాట్లాడుతూ.. "ఈ రాత్రి ప్రసారమైన కథనాలు అసహ్యకరమైనవి, అనారోగ్యకరమైనవి. ఇవి ఎంతమాత్రం క్షమించలేని చర్యలు. ప్రజా పరిపాలన జరిగే పవిత్రమైన చోట.. ఇలాంటివి జరగడం నిజంగా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు." అని ప్రధాని పేర్కొన్నారు. వీటిపై వెంటనే స్పందించిన తన పరిపాలన విభాగం వీటికి పాల్పడిన ఉద్యోగులను విధులను నుంచి తొలిగించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఆ దేశ ఆర్థిక మంత్రి సైమన్ బర్మింగ్‌హామ్ సోమవారం కీలక ప్రకటన చేశారు. 

Updated Date - 2021-03-23T18:42:54+05:30 IST