ప్రధాని మోదీకి పాక్ సోదరి కమర్ రాఖీ

ABN , First Publish Date - 2020-07-31T11:56:38+05:30 IST

రక్షాబంధన్ సందర్భంగా భారత ప్రధాని మోదీకి పాకిస్థాన్ సోదరి కమర్ మొహిసిన్ షేక్ రాఖీ పంపించారు....

ప్రధాని మోదీకి పాక్ సోదరి కమర్ రాఖీ

న్యూఢిల్లీ : రక్షాబంధన్ సందర్భంగా భారత ప్రధాని మోదీకి పాకిస్థాన్ సోదరి కమర్ మొహిసిన్ షేక్ రాఖీ పంపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించాలని దేవుడిని ప్రార్థిస్తూ కమర్ రాఖీని పోస్టులో పంపించారు. అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా చేసుకునే రక్షాబంధన్ వేడుక సందర్భంగా గత 25 ఏళ్లుగా పాక్ సోదరి కమర్ మోదీకి రాఖీ కడుతున్నారు. ప్రధాని మోదీ సాధారణమైన వ్యక్తి అయినా బాగా పనిచేస్తారని కమర్ కితాబునిచ్చారు. తనతోపాటు తన భర్త, కుమారుడు కూడా భారత ప్రధాని మోదీని అభిమానిస్తారని కమర్ మొహిసిన్ చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ పై ప్రధాని మోదీ తీసుకున్న చర్యను పాక్ సోదరి ప్రశంసించారు.వచ్చే ఐదేళ్లు మోదీకి మంచి జరగాలని తాను ప్రార్థిస్తున్నానని షేక్ చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ పై మోదీ తప్ప మరెవరూ చర్యలు తీసుకోలేరని కమర్ అభినందించారు.ప్రధాన మంత్రి మోదీకి కూడా ఓ విదేశీ మహిళ రాఖీ కట్టడం విశేషంగా నిలిచింది. దాయాది దేశమైన పాకిస్థాన్ దేశానికి చెందిన కమర్ మోహ్‌సిన్ షేక్ ప్రతి రాఖి పండగకి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాఖీ కట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Updated Date - 2020-07-31T11:56:38+05:30 IST