బల్బీర్ ‌సింగ్‌కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-05-25T20:54:56+05:30 IST

ప్ర‌ముఖ‌ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్(96) సోమవారం ఉదయం క‌న్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

బల్బీర్ ‌సింగ్‌కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్ర‌ముఖ‌ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్(96) సోమవారం ఉదయం క‌న్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్ప‌డ‌టంతో బ‌ల్‌బీర్‌సింగ్ ఆసుపత్రి తుదిశ్వాస విడిచారు. అయితే బల్‌బీర్ సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. 


‘‘పద్మశ్రీ బల్‌బీర్ సింగ్ ఆయన చేసిన ప్రదర్శనల్లో మనకు గుర్తుండిపోతారు. ఆయన దేశానికి ఎంతో గౌరవాన్ని, ఎన్నో పురస్కారాలను తీసుకువచ్చారు. ఆయన అత్యద్భుతమైన హాకీ ప్లేయర్ మాత్రమే కాదు.. గొప్ప మెంటార్ కూడా. ఆయన మరణ వార్త ఎంతో బాధించింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. 


‘‘బల్‌బీర్ సింగ్ మరణవార్త విని ఎంతో బాధకలిగింది. మూడుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడళ్లు, పద్మశ్రీ అవార్డు అందుకు గొప్ప అథ్లెట్ అయన. భవిష్యత్ తరాలకు ఆయన ఎంతో ఆదర్శం. ఆయన కుటుంబానికి, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ కోవిడ్ ట్వీట్ చేశారు. 


బల్‌బీర్ సింగ్ మూడుసార్లు భార‌త్‌కు ఒలింపిక్ బంగారు పతకాలు అందించిన ఘ‌న‌త‌ ద‌క్కించుకున్నారు. బ‌ల్‌బీర్‌సింగ్ గోల్ మెషీన్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రసిద్ది గుర్తింపుపొందారు. హాకీ ఒలింపిక్స్ లండన్ (1948), హెల్సింకి (1952), మెల్‌బోర్న్‌ (1956)లలో భారత్ బంగారు పతకాల‌ను సాధించింది. ఈ మూడు జట్లలోనూ బల్బీర్ సింగ్ సీనియర్ స‌భ్యునిగా ఉన్నారు. 





Updated Date - 2020-05-25T20:54:56+05:30 IST