సుమిత్‌ను చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-08-31T00:32:18+05:30 IST

టోక్యో పారాలింపిక్స్‌ జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్‌పై ప్రధాని నరేంద్రమోదీ

సుమిత్‌ను చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: టోక్యో  పారాలింపిక్స్‌ జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు మెరుస్తూనే ఉన్నారంటూ ప్రధాని ట్వీట్ చేశారు. పారాలింపిక్స్‌లో సుమిత్ అత్యుత్తమ ప్రదర్శనకు దేశం గర్విస్తోందన్నారు. స్వర్ణం పతకం సాధించినందుకు అభినందనలు తెలిపిన మోదీ.. భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. 


పారాలింపిక్స్‌ పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఫైనల్‌లో సుమిత్ రికార్డులు బద్దలుగొట్టి మరీ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 68.55 మీటర్లు విసిరి రికార్డు సృష్టించాడు. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. తాజా పతకంతో టోక్యోలో సాధించిన భారత పతకాల సంఖ్య 7కు పెరిగింది. పారాలింపిక్స్‌లో ఇన్ని పతకాలు సాధించడం భారత్‌కు ఇదే తొలిసారి. 

Updated Date - 2021-08-31T00:32:18+05:30 IST