కరోనా యోధులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2020-08-15T13:42:07+05:30 IST

74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కరోనా యోధులకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు....

కరోనా యోధులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు

న్యూఢిల్లీ :74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కరోనా యోధులకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ‘‘నా తోటి భారతీయుల సామర్థ్యం, విశ్వాసంపై నాకు నమ్మకముంది..మేం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రాంతి తీసుకోం. కలను భారత్ సాకారం చేస్తుందని నాకు నమ్మకముంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నందున కరోనా యోధులను అభినందించడం మర్చిపోకూడదని మోదీ అన్నారు. ఎర్రకోట వద్ద భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా వ్యాప్తి కారణంగా ఎర్రకోట వద్ద భౌతికదూరం పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అతిథులు సామాజిక దూరం పాటించడంతోపాటు ముఖాలకు ముసుగులు ధరించి ఎర్రకోట ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు ప్రధాని మోదీ రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్ముడికి నివాళులు అర్పించారు. 

Updated Date - 2020-08-15T13:42:07+05:30 IST