Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 24 Mar 2022 09:20:17 IST

మాజీ సీజేఐ లహోటీ మృతి పట్ల మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

twitter-iconwatsapp-iconfb-icon

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌సి లహోటీ ఆకస్మిక మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ట్వీట్‌లో న్యాయవ్యవస్థకు ఆర్‌సి లహోటీ చేసిన విశేషమైన కృషిని మోదీ ప్రశంసించారు.‘‘మాజీ సీజేఐ ఆర్‌సి లహోటీ జీ మరణించడం నాకు బాధ కలిగించింది. న్యాయవ్యవస్థకు ఆయన చేసిన కృషి మరవలేనిది. అణగారిన వర్గాలకు సత్వర న్యాయం జరిగేలా దృష్టి సారించినందుకు ఆయన అందరికీ గుర్తుంటారు. ఆయన కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు సానుభూతి తెలిపారు. ఓం శాంతి’’ అంటూ ప్రధాని మోదీ ఒక ట్వీట్‌ చేశారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రమేష్ చంద్ర లహోటీ బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.

 మాజీ సీజేఐ వయసు 81 ఏళ్లు.జస్టిస్ లహోటీ 2004 వసంవత్సరం జూన్ 1వతేదీన భారతదేశ 35వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన 2005వ సంవత్సరం నవంబర్ 1వతేదీన పదవీ విరమణ చేశారు.1940 వ సంవత్సరం నవంబర్ 1వతేదీన  జన్మించిన లహోటీ 1960లో గుణ జిల్లాలో బార్‌ అసోసియేషన్ లో చేరారు. లహోటి ఏప్రిల్ 1977లో నేరుగా బెంచ్‌లో బార్ నుంచి స్టేట్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్‌కు రిక్రూట్ అయ్యి జిల్లా సెషన్స్ జడ్జి అయ్యారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.