ప్రిన్స్ ఫిలిప్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-04-10T00:08:25+05:30 IST

డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరో ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల ప్రధాన

ప్రిన్స్ ఫిలిప్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరో ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. ప్రిన్స్ ఫిలిప్ సైన్యంలో విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో బ్రిటిష్ ప్రజలకు, రాజ కుటుంబానికి ట్విటర్ వేదికగా సంఘీభావం ప్రకటించారు. 


మోదీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో ప్రిన్స్ ఫిలిప్ పరమపదించిన నేపథ్యంలో బ్రిటిష్ ప్రజలకు, రాజ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఆయన సైన్యంలో విశేష సేవలందించారని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 


బ్రిటిష్ రాజవంశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రిన్స్ ఫిలిప్ (99) శుక్రవారం ఉదయం కన్నుమూశారని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. . విండ్సర్ కేజిల్‌లో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలిపింది. ప్రిన్స్ ఫిలిప్ మరణ వార్తను రాజ వంశ కుటుంబ సభ్యులందరికీ తెలియజేసినట్లు పేర్కొంది. ఇటీవల ఆయనకు కింగ్ ఎడ్వర్డ్-7 హాస్పిటల్, సెయింట్ బరతోలోమెవ్ హాస్పిటల్‌లో చికిత్స జరిగింది. 


Updated Date - 2021-04-10T00:08:25+05:30 IST