ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతి వారికి ప్రధాని స్కాట్ మారిసన్ హోలీ శుభాకాంక్షలు!

ABN , First Publish Date - 2022-03-19T01:29:05+05:30 IST

రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ అక్కడి భారతీయ సంతతి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతి వారికి ప్రధాని స్కాట్ మారిసన్ హోలీ శుభాకాంక్షలు!

ఎన్నారై డెస్క్:  రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ అక్కడి భారతీయ సంతతి వారికి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ పండుగ.. ప్రజల జీవితాల్లో రంగులు నింపుతూ అందరినీ ఏకతాటిపై తెస్తుందోని వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభం సమసిపోతున్న నేపథ్యంలో ఈ వేడుక దేశ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. 


విభిన్న సంస్కృతులు, మత విశ్వాలకు నెలవైన ఆస్ట్రేలియా.. స్వేచ్ఛగా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి జీవించడమెలాగో ప్రపంచానికి చాటి చెబుతోందన్నారు. ఆస్ట్రేలియా అభివృద్ధికి ఎంతో పాటుపడిన భారతీయ సంతతి వారికి ప్రధాని ఈ సందర్భంగా  కృతజ్ఞతలు తెలిపారు. కరోనా ఆంక్షల కారణంగా ఎంతో కాలంగా ఎవరికి వారుగా జీవిస్తున్న ప్రజలందరని.. హోలీ పర్వదీనం దగ్గర చేసిందన్నారు. కాగా..  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు హోలీ సంబరాల్లో సంతోషంగా పాల్గొన్నారు. స్థానికులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటూ.. సోదరభావం, స్నేహం ప్రాముఖ్యాన్ని చాటి చెప్పారు. 

Updated Date - 2022-03-19T01:29:05+05:30 IST