Heeraben Modi 100వ పుట్టినరోజు...తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

ABN , First Publish Date - 2022-06-18T13:56:10+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ శనివారం తన 100వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు....

Heeraben Modi 100వ పుట్టినరోజు...తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

గాంధీనగర్ (గుజరాత్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ శనివారం తన 100వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు.పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్‌లోని ఆమె నివాసంలో తన తల్లి హీరాబెన్ మోదీని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. తన తల్లి కాళ్లను కడిగిన మోదీ ఆ నీళ్లను కళ్లకు అద్దుకున్నారు. అనంతరం తల్లికి మిఠాయిలు తినిపించిన ప్రధాని మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె తన చిన్న కొడుకు పంకజ్ (పీఎం మోడీ సోదరుడు)తో కలిసి గాంధీనగర్‌లో నివసిస్తోంది. 100 ఏళ్ల వయస్సులో కూడా హీరాబెన్‌కు ఎలాంటి వ్యాధి లేదు. ఆమె సాధారణ ఆహారాన్ని ఇష్టపడుతుంటారు. అదే ఆమె ఆరోగ్య రహస్యం కావచ్చు.



ప్రధాని మోదీ తల్లి ప్రత్యేకమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు.తాను తినే ఆహారాన్ని తానే వండుకోవడానికి ఇష్టపడుతుంటారని సమాచారం. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం ఆమెకు ఇష్టం ఉండదు. ఆమె రోజువారీ ఆహారంలో పప్పు, అన్నం, కిచడీచ చపాతీ ఉంటాయి. చక్కెర మిఠాయి తినడానికి ఆమె ఇష్టపడతారని చెబుతుంటారు.కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా మంది ప్రజలు భయపడినపుడు,మోదీ తల్లి వ్యాక్సిన్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు. ఈ వయస్సులో, ఆమె వ్యాక్సిన్ పొందడం ద్వారా ప్రజల మనస్సులోని భ్రమలను తొలగించడానికి ప్రయత్నించారు.


గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో రైసన్ పరిసరాల్లోని 80 మీటర్ల రహదారికి ఇటీవల పూజ్య హీరాబా మార్గ్ అని పేరు పెట్టారు. గుజరాత్‌ రాష్ట్ర పర్యటనలో ఉన్న మోదీ పావగఢ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, వడోదరలో జరిగే ర్యాలీలో ప్రసంగించనున్నారు.




Updated Date - 2022-06-18T13:56:10+05:30 IST