బీహార్‌కు ప్రధాని మోదీ ఎన్నికల తాయిలాలు...

ABN , First Publish Date - 2020-09-21T11:22:28+05:30 IST

బీహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఎన్నికల తాయిలాలు ప్రకటించారు.....

బీహార్‌కు ప్రధాని మోదీ ఎన్నికల తాయిలాలు...

రూ.14,258కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణానికి నేడు శంకుస్థాపన

న్యూఢిల్లీ : బీహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఎన్నికల తాయిలాలు ప్రకటించారు. బీహార్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం రూ. 14,258 కోట్లతో 9 జాతీయ రహదారుల నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. బీహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని 45,945 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ ఇంటర్ నెట్ సర్వీసులు కల్పించారు. ఈ ఫైబర్ ఇంటర్ నెట్ సర్వీసులను ప్రధాని సోమవారం ప్రారంభించ నున్నారు.


 బీహార్ రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ లైను ఏర్పాటు వల్ల డిజిటల్ విప్లవం రానుందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, ప్రాథమిక పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు ఉచితంగా ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించనున్నారు. దీనిద్వారా ఈ-ఎడ్యుకేషన్, ఈ-అగ్రికల్చర్, టెలీమెడిసిన్, టెలీ లా అండ్ సెక్యూరిటీ పథకాలను బీహార్ లో అమలు చేస్తామని ప్రధాని కార్యాలయ అధికారులు వివరించారు. 


అక్టోబరు, నవంబరు నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని బీహార్ రాష్ట్రంలో రైల్వే వంతెనలు, మంచినీటి సరఫరా పథకాలతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. 350 కిలోమీట్ల దూరం జాతీయ రహదారుల నిర్మాణం వల్ల రవాణ సౌకర్యాలు మెరుగుపడతాయని ప్రధాని కార్యాలయ అధికారులు చెప్పారు.9 జాతీయ రహదారుల నిర్మాణంతో బీహార్ రాష్ట్రానికి యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి రవాణ సౌకర్యం మెరుగుపడనుంది.గతంలో ప్రధాని మోదీ బీహార్ అభివృద్ధికి 54,700 కోట్ల రూపాయలతో 75 ప్రాజెక్టులు చేపట్టగా, వీటిలో 13 ప్రాజెక్టులు పూర్తి చేశారు. మరో 38 ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కానున్నాయి.


Updated Date - 2020-09-21T11:22:28+05:30 IST