కోవిడ్ పరిస్థితిపై రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2022-04-27T00:29:24+05:30 IST

కోవిడ్ పరిస్థితిపై రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

కోవిడ్ పరిస్థితిపై రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కోవిడ్-19 పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని కోవిడ్ పరిస్థితులపై సీఎంలతో ప్రధాన మంత్రి మోదీ మాట్లాడనున్నట్లు అధికారి చెప్పారు. అనేక పండుగలు రానున్నందున కరోనా వైరస్ నుంచి వచ్చే ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ ఆదివారం ప్రజలను కోరారు. కోవిడ్ నింబంధనలు తప్పని సరిగా పాటించాలని, మాస్క్‌లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశంలో కొత్తగా 2,483 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. కోవిడ్-19 కేసుల సంఖ్య 4,30,62,569కి పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,636 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Updated Date - 2022-04-27T00:29:24+05:30 IST