న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని బీజేపీ కార్యకర్తలతో ఈనెల 18న సమావేశమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాత అక్కడి పార్టీ కార్యకర్తలతో ప్రధాని సమావేశం కానుండటం ఇదే మొదటిసారి. వర్చువల్ మీట్ ద్వారా కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్‌కు శనివారంనాడు తెరపడింది. మొదటి, రెండో విడత పోలింగ్ జరిగే స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. గోరఖ్‌పూర్ సిటీ నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది.