కోవిడ్ పరిస్థితిని సమీక్షించనున్న ప్రధాని

ABN , First Publish Date - 2021-12-22T20:36:03+05:30 IST

దేశంలో ఒమైక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ ...

కోవిడ్ పరిస్థితిని సమీక్షించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: దేశంలో ఒమైక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించనున్నారు. ఆయన అధ్యక్షతన గురువారంనాడు సమీక్షా సమావేశం జరుగనుంది. దేశంలో ఒమైక్రాన్ కేసులు 213కు చేరిన నేపథ్యంలో ప్రధాని ఈ సమీక్ష జరపనుండటం ప్రాధాన్యం సంతరించుకోనుంది.


దేశవ్యాప్తంగా ఇంతవరకూ నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు ఢిల్లీ, మహారాష్టలో నమోదయ్యాయి. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54 కేసులు నమోదయ్యాయి. ఇంతవరకూ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమైక్రాన్ కేసులు గుర్తించారు. తెలంగాణలో 24, రాజస్థాన్‌లో 18, కర్ణాటకలో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14, ఆంధ్రప్రదేశ్‌లో 2, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కాగా, పాజిటివీ రేటు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేయడం, బహిరంగంగా జనం గుమిగూడకుండా చూడటం, వివాహాలకు హాజరయ్యే వారి సంఖ్యను కుదించడంతో సహా పలు ఆంక్షలు విధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశారు.

Updated Date - 2021-12-22T20:36:03+05:30 IST