హత్రాస్ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ యోగికి మోదీ ఫోన్

ABN , First Publish Date - 2020-09-30T18:33:05+05:30 IST

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ చేశారు. హత్రాస్

హత్రాస్ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ యోగికి మోదీ ఫోన్

న్యూఢిల్లీ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ చేశారు. హత్రాస్ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సీఎం యోగిని మోదీ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టకూడదని యోగికి సూచించారు. ఈ విషయాన్ని యోగి తెలిపారు.


‘‘హత్రాస్ ఘటన విషయంలో ప్రధాని ఫోన్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సూచించారు. బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టం. ఈ విషయంపై ముగ్గురు సభ్యులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేశాం. ఏడు రోజుల్లో ఈ ప్యానెల్ రిపోర్టు సమర్పిస్తుంది.’’ అని సీఎం యోగి పేర్కొన్నారు.


యూపీకి చెందిన మనీషా వాల్మీకి అనే యువతిని నలుగురు కిడ్నాప్ చేశారు. అత్యంత దారుణంగా హింసిస్తూ..అత్యాచారం చేశారు. కుటుంబసభ్యులను ఇంట్లో తాళం వేసి, యువతి మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా దహనం చేశారని స్థానికులు ఆరోపించారు.

Updated Date - 2020-09-30T18:33:05+05:30 IST