PM Modi: లౌడ్ స్పీకర్ నిబంధనలు పాటించి...ప్రసంగించకుండానే వెనుతిరిగిన మోదీ

ABN , First Publish Date - 2022-10-01T12:03:06+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం రాజస్థాన్‌లోని సిరోహిలోని అబు రోడ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీని(Rajasthan rally) ఉద్ధేశించి ప్రసంగించకుండానే వెనుతిరిగారు....

PM Modi: లౌడ్ స్పీకర్ నిబంధనలు పాటించి...ప్రసంగించకుండానే వెనుతిరిగిన మోదీ

జైపూర్(రాజస్థాన్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం రాజస్థాన్‌లోని సిరోహిలోని అబు రోడ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీని(Rajasthan rally) ఉద్ధేశించి ప్రసంగించకుండానే వెనుతిరిగారు.రాజస్థాన్ ర్యాలీ వేదికకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా చేరుకున్న ప్రధాని మోదీ లౌడ్ స్పీకర్ నిబంధనలకు(loudspeaker norms) లోబడి ప్రసంగాన్ని దాటవేశారు.(skips address)ప్రసంగించలేకపోయినందుకు సభకు ముందు క్షమాపణలు చెప్పిన మోదీ మళ్లీ సిరోహికి వస్తానని హామీ ఇచ్చారు. ‘‘నేను సభకు రావడం ఆలస్యమైంది, రాత్రి 10 గంటలైంది... రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని నా మనస్సాక్షి చెబుతోంది కాబట్టి మీకు ముందుగా క్షమాపణలు కోరుతున్నాను’’ అని లౌడ్ స్పీకర్(loudspeaker) లేకుండా మోదీ మాట్లాడారు. 


 ‘‘నేను మళ్ళీ ఇక్కడికి వస్తానని, మీరు నాకు ఇచ్చిన ప్రేమను వడ్డీతో తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేస్తున్నాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రధాని మోదీ భారత్ మాతా కీ జై(Bharat Mata ki Jai) అంటూ  నినాదాన్ని వినిపించారు. దీంతో ప్రజలు భారత్ మాతా కీ జై అంటూ హోరున నినాదాలు చేశారు.అంతకుముందు ప్రధాని మోదీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా, మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, డిప్యూటీ రాజేంద్ర రాథోడ్ స్వాగతం పలికారు.


సిరోహి, దుంగార్‌పూర్, బన్స్వారా, చిత్తోర్‌గఢ్, ప్రతాప్‌గఢ్, బన్స్వారా, పాలి, ఉదయ్‌పూర్ జిల్లాల నుండి బీజేపీ కార్యకర్తలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు ర్యాలీకి తరలివచ్చినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌తో సరిహద్దును పంచుకునే దక్షిణ రాజస్థాన్‌ లో ప్రధాని ర్యాలీని ఏర్పాటు చేశారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో కూడా వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని అంబాజీ ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అబూ రోడ్డుకు ఆలస్యంగా వచ్చారు.


Updated Date - 2022-10-01T12:03:06+05:30 IST