Abn logo
Sep 10 2021 @ 03:27AM

మీ ప్రదర్శన స్ఫూర్తిదాయకం

 పారా అథ్లెట్లకు ప్రధాని  ప్రశంస

న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సాధించిన విజయాలు దేశ క్రీడా రంగానికి స్ఫూర్తినిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. అంతేకాదు..ఔత్సాహిక క్రీడాకారులు ఆటలను కెరీర్‌గా ఎంచుకొనేలా ప్రోత్సహిస్తాయన్నారు. ఇటీవల ముగిసిన టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులకు మోదీ గురువారం తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా..తాము సంతకాలు చేసిన తెల్లటి శాలువాను అథ్లెట్లు ప్రధానికి అందజేయగా దానిని ఆయన మెడలో ధరించారు. పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు 19 పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, మరో మంత్రి కిరణ్‌ రిజిజు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

క్రైమ్ మరిన్ని...