తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్

ABN , First Publish Date - 2021-05-07T03:53:44+05:30 IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సోకి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు ఆక్సిజన్, టీకాల కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. దీంతో రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడారు. కోవిడ్ పరిస్థితులపై తెలంగాణ, ఏపీ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులతోనూ మోదీ చర్చించారు. పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్ గవర్నర్లతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడారు. వ్యాక్సిన్లు, రెమ్‌డిసివిర్‌లు కావాలని, త్వరగా సరఫరా చేయాలని కోరారు. రోజుకు 25వేల రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లు పంపాలని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 


ఏపీ సీఎం జగన్‌తోనూ ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కరోనా ఉధృతి, తీసుకుంటున్న చర్యలను జగన్‌ను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధానికి జగన్‌ వివరించారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు పెంచామని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. 





Updated Date - 2021-05-07T03:53:44+05:30 IST