మేనక, వరుణ్‌గాంధీలకు దక్కని చోటు..

ABN , First Publish Date - 2022-01-19T22:58:26+05:30 IST

ఉత్తరప్రదేశ్ మొదటి విడత ఎన్నికల కోసం బీజేపీ 30 మందితో బుధవారం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో..

మేనక, వరుణ్‌గాంధీలకు దక్కని చోటు..

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మొదటి విడత ఎన్నికల కోసం బీజేపీ 30 మందితో బుధవారం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని మోదీ పేరు మొదటి స్థానంలో నిలవగా, మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు మాత్రం జాబితాలో చోటు దక్కలేదు. సుల్తాన్‌పూర్, ఫిలిభిత్ నియోజకవర్గాల్లో మేనక, వరుణ్ గాంధీ పలుమార్లు గెలిచినప్పటికీ వీరికి ఎన్నికల ప్రచారకుల జాబితాలో చోటుదక్కకపోవడం విశేషం. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూర్పులోనూ ఈ తల్లీకొడుకులిద్దరికీ చోటు కల్పించలేదు. మూడు వ్యవసాయ చట్టాలతో సహా  ప్రధాని మోదీ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలపై వరుణ్‌గాంధీ తరచు నిశిత విమర్శలు చేస్తుండటం ఆయనను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచడానికి ఒక కారణంగా చెబుతున్నారు.


కాగా, యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికలు జరుగనుండగా, మొదటి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగనుంది. మార్చి 7న జరిగే చివరి విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-01-19T22:58:26+05:30 IST