ఉత్తరాఖండ్‌లో ఆరు మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

ABN , First Publish Date - 2020-09-29T21:33:20+05:30 IST

నమామి గంగా మిషన్ కింద ఉత్తరాఖండ్‌లో ఆరు మెగాప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు.

ఉత్తరాఖండ్‌లో ఆరు మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: నమామి గంగా మిషన్ కింద ఉత్తరాఖండ్‌లో ఆరు మెగాప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన జల్‌జీవన్ మిషన్ లోగోను ఆవిష్కరించారు. 


గ్రామ పంచాయితీలో పానీ సమితుల ఏర్పాటు ద్వారా జల్‌జీవన్ పథకాన్ని ప్రభుత్వం రూపాయికే అమలు చేయనుంది. ఉత్తరాఖండ్‌లోని గజీత్ పూర్, హరిద్వార్, రిషికేష్, లక్కడ్ ఘాట్‌లలో ఎస్టీపీలతోపాటు రక్షిత మంచినీటి పథకాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. హరిద్వార్, రిషికేష్ జోన్లలో 80 శాతం వ్యర్థ జలాలు గంగానదిలో వృథాగా పోతున్నాయి. వాటిని ఎస్టీపీల ద్వారా మళ్లిస్తారు. దీంతో గంగానదిలో కాలుష్యం తగ్గుతుంది.


చోర్పానీ, భద్రీనాథ్ ప్రాంతాల్లో మూడు ఎస్టీపీలు ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే గంగా అవలోకన్ పేరుతో ఏర్పాటైన మ్యూజియాన్ని ఆయన ప్రారంభించారు. హరిద్వార్‌లోని చండీఘాట్‌లో ఈ మ్యూజియాన్ని నెలకొల్పారు. క్లీన్ గంగా ప్రాజెక్టులతోపాటు వన్యప్రాణుల సంస్థకు మోదీ శ్రీకారం చుట్టారు.

Updated Date - 2020-09-29T21:33:20+05:30 IST