Himachal Pradesh : బిలాస్‌పూర్‌లో మోదీ ప్రారంభించిన ఎయిమ్స్ విశేషాలు

ABN , First Publish Date - 2022-10-05T18:49:56+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని

Himachal Pradesh : బిలాస్‌పూర్‌లో మోదీ ప్రారంభించిన ఎయిమ్స్ విశేషాలు

బిలాస్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలను పటిష్టపరచడంలో భాగంగా రూ.1,470 కోట్లతో దీనిని నిర్మించారు. దీనికి మోదీ 2017లో శంకుస్థాపన చేశారు. ఆత్మీయతను పంచే ప్రజలు, ఘనమైన సంస్కృతి ఉన్న రాష్ట్రానికి వస్తుండటం సంతోషంగా ఉందని ఆయన మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


బిలాస్‌పూర్‌లో మోదీ ప్రారంభించిన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) విశేషాలు :


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఆసుపత్రికి 2017లో శంకుస్థాపన చేశారు. 18 స్పెషాలిటీ, 17 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లు, 18 మాడ్యులార్ ఆపరేషన్ థియేటర్లు దీనిలో ఉన్నాయి. 


ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన  (PMSSY)లో భాగంగా దీనిని నిర్మించారు. దీని సామర్థ్యం 750 పడకలు. వీటిలో 64 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) బెడ్స్. 


247 ఎకరాల్లో రూ.1,470 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. అన్ని వేళలా అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. డయాలసిస్ ఫెసిలిటీస్, మోడర్న్ డయాగ్నొస్టిక్ మెషిన్స్ ఏర్పాటు చేశారు. 


30 పడకల ఆయుష్ (AYUSH) బ్లాక్ కూడా దీనిలో ఉంది. దీనిలో ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునానీ, సిద్ధ, హోమియోపతి విధానాల్లో చికిత్స అందిస్తారు. 


హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్‌ను ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. 


బిలాస్‌పూర్ ఎయిమ్స్ ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సులో 100 మందికి, నర్సింగ్ కోర్సుల్లో 60 మందికి ప్రవేశం కల్పిస్తుంది. 


Updated Date - 2022-10-05T18:49:56+05:30 IST