రూ.1,000 విరాళం ఇచ్చిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-12-25T21:16:12+05:30 IST

ఎల్లప్పుడూ దేశానికి మొదటి స్థానం ఇవ్వాలనే మా ఆదర్శం, మీ చిన్న విరాళం ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి గల మా కేడర్‌ మరింత బలోపేతం అవుతుంది. బీజేపీని మరింత బలోపేతం చేయడంలో సహకరించండి. అలాగే దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి కూడా సహకరించండి..

రూ.1,000 విరాళం ఇచ్చిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 1,000 రూపాయల విరాళం అందించారు. పార్టీకి విరాళం ఇచ్చిన ‘పే స్లిప్‌’ను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో బుధవారం షేర్ చేశారు. బీజేపీకి విరాళం ఇచ్చి, పార్టీని మరితం బలోపేతం చేయాలని, అలాగే దేశాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. పార్టీ ఫండ్ కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు మోదీ పేర్కొన్నారు.


‘‘భారతీయ జనతా పార్టీకి పార్టీ ఫండ్ కోసం 1,000 రూపాయలు విరాళం అందించాను. ఎల్లప్పుడూ దేశానికి మొదటి స్థానం ఇవ్వాలనే మా ఆదర్శం,  మీ చిన్న విరాళం ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి గల మా కేడర్‌ మరింత బలోపేతం అవుతుంది. బీజేపీని మరింత బలోపేతం చేయడంలో సహకరించండి. అలాగే దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి కూడా సహకరించండి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం పార్టీకి 1,000 రూపాయలు విరాళం అందించారు. ‘‘నమో యాప్‌ని ఉపయోగించి బీజేపీని బలోపేతం చేయడానికి నావంతు బాధ్యతగా సహకారం అందించాను. రిఫరల్ కోడ్‌ని ఉపయోగించి ఈ ప్రజా ఉద్యమంలో మీతో పాటు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయవచ్చు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న బీజేపీని మరింత శక్తివంతం చేయవచ్చు’’ అని నడ్డా ట్వీట్ చేశారు.


పార్టీ వాలెంటరీ కలెక్షన్స్ కోసం మైక్రో డొనేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా పార్టీలోని ప్రతి వ్యక్తి నుంచి కనిష్టంగా 5 రూపాయలతో మొదలుకుని గరిష్టంగా 1,000 రూపాయల వరకు విరాళాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్ దయాల్ ఉపాధ్యాయ్ వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2021-12-25T21:16:12+05:30 IST