Abn logo
Sep 19 2020 @ 14:59PM

మా మేనిఫెస్టోను మోదీ వక్రీకరిస్తున్నారు : చిదంబరం

Kaakateeya

న్యూఢిల్లీ : తమ మేనిఫెస్టోను ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ఉద్దేశ పూర్వకంగానే వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మండిపడ్డారు. రైతులకు బహు సులభంగా అందుబాటులో ఉన్న మార్కెట్లు అవసరమని అన్నారు. ఇదే అంశాన్ని తాము తమ మేనిఫెస్టోలో పొందు పరిచామని ఆయన స్పష్టం చేశారు.


రైతులు, వివిధ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందేందుకు వీలు కల్పించేలా తమ మేనిఫెస్టో రూపొందించామని, దీంతో పాటు పెద్ద పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాల్లో స్వేచ్ఛగా వర్తకం చేయడానికి తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.


కేంద్రం తీసుకొచ్చిన బిల్లుతో రైతులు, ప్రైవేట్ కొనుగోలు దారులు సమానంగా బేరసారాలు చేసే అవకాశం కల్పిస్తోందని, ఇలా చేయడం వల్ల ప్రైవేట్ కొనుగోలుదారుల దయా దాక్షిణ్యాలపై రైతు ఆధారపడే దుస్థితి వస్తుందని ఆయన మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ ట్రేడర్లకు లొంగిపోయిందని చిదంబరం విమర్శించారు. 

Advertisement
Advertisement