NRIలపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2022-06-27T14:36:52+05:30 IST

జర్మనీలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రవాస భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ అభివృద్ధిలో ప్రవాసుల కృషిని అభినందించారు. ఆడి డోమ్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. NRIలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశ విజయానికి ఎన్నారైలు..

NRIలపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

ఎన్నారై డెస్క్: జర్మనీలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రవాస భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ అభివృద్ధిలో ప్రవాసుల కృషిని అభినందించారు. ఆడి డోమ్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. NRIలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశ విజయానికి ఎన్నారైలు బ్రాండ్ అంబాసిడర్‌లుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న పలు కార్యక్రమాల గురించి ఆయన ప్రస్తావించారు. నేటి యువత కోసం 21వ శతాబ్దపు విధానాలను తీసుకొచ్చినట్టు వెల్లడించారు.



దీంతో యువత తమ మాతృ భాషలో చదువు పూర్తి అవకాశం కల్పించినట్టు తెలిపారు. India సంకల్ప్ నుంచి సమృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. 75వ సాంత్రత్య్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇండియా కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటోందని.. వాటిని సాధించేందుకు పని చేస్తుందని వివరించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. ఈ క్రమంలోనే ఒకపుడు ఫోన్‌లను దిగుమతి చేసుకోవడం నుంచి ప్రపచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల తయారీ కేంద్రంగా భారత్ మారిందని ఈ సందర్భంగా Modi అన్నారు. ఇదిలా ఉంటే.. జీ7 సమ్మీట్‌లో పాల్గొనేందకు ప్రధాని జర్మనీకి వెళ్లిన విషయం తెలిసిందే. 


Updated Date - 2022-06-27T14:36:52+05:30 IST