ట్విటర్ ఖాతా ఫొటో మార్చేసిన మోదీ

ABN , First Publish Date - 2021-10-22T18:06:26+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో భారీ విజయం

ట్విటర్ ఖాతా ఫొటో మార్చేసిన మోదీ

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో భారీ విజయం నమోదుకావడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్విటర్ హ్యాండిల్ ప్రొఫైల్ పిక్చర్‌ను శుక్రవారం మార్చారు. ‘‘అభినందనలు భారత దేశమా! 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది’’ అని రాశారు. అక్టోబరు 21 ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా 100 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడం పూర్తయిన సంగతి తెలిసిందే. 


వ్యాక్సినేషన్ భారీ విజయం సాధించిన సందర్భంగా మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘అక్టోబరు 21న భారత దేశం 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయం దేశంలోని ప్రతి వ్యక్తికి సంబంధించినది. ఈ మహోన్నత కృత్యానికి ప్రతి పౌరుడిని అభినందిస్తున్నాను’’ అని తెలిపారు. పండుగల సందర్భంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజలను కోరారు. 


Updated Date - 2021-10-22T18:06:26+05:30 IST