Abn logo
Sep 18 2020 @ 04:54AM

గల్ఫ్ దేశాల్లో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

Kaakateeya

దుబాయి: గల్ఫ్ దేశాలైన ఒమాన్, యూఏఈ, ఖతార్, కువైట్, బహరేన్‌లలో బీజేపీ తెలంగాణ ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈ వేడుకలు నిర్వహించినట్టు మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు. మిడిల్ ఈస్ట్ చైర్మన్ తోపాలి శ్రీనివాస్, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు సూచనతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒమాన్‌లో.. ఒమాన్ కన్వీనర్ మంచికట్ల కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ ముఖ్య నాయకులు మామిడి శ్యాం, మురళి నడ్లపాటి, సాయి కుమార్ నిడిమోలు, అల్లే గంగాధర్, చెని గురువయ్య, సమంతి గంగాధర్ పాల్గొన్నారు. 

ఖతర్‌లో.. ఖతర్ కన్వీనర్ విలాసాగరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శివప్రసాద్, సత్యనారాయణ, నాంపెళ్ళి, బాలయ్య, రాజశేఖర్, రాజయ్య, కిరణ్, రేడ్డి పాల్గొన్నారు. కువైట్‌‌లో.. కువైట్ కోఆర్డినేటర్ క్యాతం రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్, భాస్కర్ కుమార్, సాయి, వాసు, కనకయ్య, శరత్, సురేందర్, ప్రవీణ్, ప్రబుదాస్, సురేష్, రాజు, రాజేష్, శేఖర్, ప్రవీణ్, అశోక్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement