3 కోట్ల పక్కా ఇళ్లు పూర్తవుతున్నాయి: ప్రధాని

ABN , First Publish Date - 2022-04-08T15:11:01+05:30 IST

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించ తలపెట్టిన ఇళ్ల నిర్మాణంలో ఇప్పటికే 2.52 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తైంది. ఈ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం 1.95 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించింది. ఇక మరో 58 లక్షల ఇళ్ల నిర్మాణం తొందరలోనే పూర్తి..

3 కోట్ల పక్కా ఇళ్లు పూర్తవుతున్నాయి: ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తవుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. ఈ ఇళ్లను ‘మహిళా సాధికారతకు చిహ్నం’మని ఆయన అన్నారు. ఈ విషయామై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘పేదలకు పక్కా ఇళ్లు అందించే కార్యక్రమంలో భాగంగా మనం కీలక అడుగు వేశాం. ప్రజా భాగస్వామ్యంతో దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని తొందర్లోనే పూర్తి చేయబోతున్నాం. కనీస సౌకర్యాలతో నిర్మితమైన ఈ ఇళ్లు మహిళా సాధికారతకు చిహ్నం’’ అని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.


ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించ తలపెట్టిన ఇళ్ల నిర్మాణంలో ఇప్పటికే 2.52 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తైంది. ఈ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం 1.95 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించింది. ఇక మరో 58 లక్షల ఇళ్ల నిర్మాణం తొందరలోనే పూర్తి అవనుందట. దీని కోసం 1.8 లక్షల కోట్లను విడుదల చేశారు. ప్రతి ఇంటిలో కనీస అవసరాలు ఉంటాయి. ప్రతి ఇంటికి ఉజ్వల యోజన కింద గ్యాస్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. అలాగే నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కూడా ప్రభుత్వమే కల్పించనుంది.

Updated Date - 2022-04-08T15:11:01+05:30 IST