భారత దేశపు తొలి కార్బన్ న్యూట్రల్ రీజియన్‌గా లడఖ్, లేహ్, కార్గిల్ : మోదీ

ABN , First Publish Date - 2020-08-15T21:26:04+05:30 IST

భారత దేశపు తొలి కార్బన్ న్యూట్రల్ రీజియన్‌గా లడఖ్, లేహ్, కార్గిల్‌లను అభివృద్ధి

భారత దేశపు తొలి కార్బన్ న్యూట్రల్ రీజియన్‌గా లడఖ్, లేహ్, కార్గిల్ : మోదీ

న్యూఢిల్లీ : భారత దేశపు తొలి కార్బన్ న్యూట్రల్ రీజియన్‌గా లడఖ్, లేహ్, కార్గిల్‌లను అభివృద్ధి చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా శనివారం జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఈ ప్రాంతంలో విద్యుత్తు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం లడఖ్‌లో 7,500 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ పార్క్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.  


గతంలో మన దేశంలో కార్బన్ న్యూట్రల్ గ్రామాలను ఏర్పాటు చేశారని, అతి పెద్ద ప్రాంతం కార్బన్ న్యూట్రల్ కావడం మన దేశంలో ఇదే మొదటిసారి అని చెప్పారు. గతంలో కేరళ, మణిపూర్‌లలో కార్బన్ న్యూట్రల్ గ్రామాలను ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేశారు. సిక్కిం ఆర్గానిక్ స్టేట్‌గా తనను తాను నిలుపుకుందని, అదేవిధంగా లడఖ్, కార్గిల్, లేహ్ ప్రాంతం కార్బన్ న్యూట్రల్ కాబోతోందని వివరించారు. ఈ లక్ష్యాన్ని స్థానిక ప్రజల భాగస్వామ్యంతో సాధిస్తామని చెప్పారు.


మానవుల ప్రమేయంతో విడుదలయ్యే కార్బన్ డయాక్పైడ్ వాయువును శూన్యం చేయడాన్నే కార్బన్ న్యూట్రాలిటీ అంటారు. వాతావరణ మార్పులపై పారిస్ అగ్రిమెంట్‌లో భాగంగా చాలా దేశాలు 2050 నాటికి కార్బన్ న్యూట్రల్ అవుతామని ప్రకటించాయి. 


Updated Date - 2020-08-15T21:26:04+05:30 IST