భారత్-శ్రీలంక సంబంధాలపై మోదీ, రాజపక్స చర్చలు

ABN , First Publish Date - 2021-03-13T23:25:54+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ

భారత్-శ్రీలంక సంబంధాలపై మోదీ, రాజపక్స చర్చలు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స శనివారం టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. తాజా పరిణామాలను వీరిద్దరూ సమీక్షించారు. ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారంపై చర్చించారు. కోవిడ్-19 విసురుతున్న సవాళ్ళతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాల అధికారులు నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. 


ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స శనివారం టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. తాజా పరిణామాలను సమీక్షించి, ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారంపై చర్చించారు. కోవిడ్-19 విసురుతున్న సవాళ్ళతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాల అధికారులు నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. 


పొరుగు దేశాలకు పెద్ద పీట అనే విధానాన్ని భారత దేశం అమలు చేస్తోందని, భారత దేశానికి శ్రీలంక చాలా ముఖ్యమైనదని మోదీ చెప్పినట్లు పీఎంఓ పేర్కొంది. 


5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ బహుమతి

శ్రీలంకకు మన దేశం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. జనవరిలో 5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను బహుమతిగా పంపించింది. ఆ తర్వాత సీరం ఇన్‌స్టిట్యూట్‌తో శ్రీలంక ప్రభుత్వం 10 లక్షల డోసుల వ్యాక్సిన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 5 లక్షల డోసుల వ్యాక్సిన్ ఫిబ్రవరిలో శ్రీలంకకు చేరింది. 


Read more