PM Modi Brand Value: మోదీ బ్రాండ్ విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?

ABN , First Publish Date - 2022-10-02T01:06:33+05:30 IST

సామాజిక మాధ్యమాల్లో ప్రధానమంత్రి మోదీకి ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ

PM Modi Brand Value: మోదీ బ్రాండ్ విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో ప్రధానమంత్రి మోదీకి ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ నాయకుల్లో ఫాలోవర్ల విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా? అంతటి క్రేజ్ సంపాదించుకున్న మోదీ బ్రాండ్ వాల్యూ(Modi Brand Value) ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే మోదీ ఎంతోమందికి స్ఫూర్తి కూడా. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుున్న మోదీ బ్రాండ్(Modi Brand Value) విలువ ఎంతో తెలుసా?.. అక్షరాలా నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు (రూ.413 కోట్లు). ఢిల్లీకి చెందిన సెంటిమెంట్ అనాలసిస్ అండ్ డిజిటల్ ర్యాంకింగ్  సంస్థ ‘చెక్‌బ్రాండ్‘(CheckBrand) ఈ లెక్కగట్టిది. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఇండియాలోని టాప్ రాజకీయ నాయకులపై వచ్చే వార్తలు, వారి గురించి జరిగే సెర్చ్‌లను లెక్కగట్టి ఆయా వ్యక్తుల బ్రాండ్ విలువను ఇది లెక్కగడుతుంది. ట్విటర్, ఫేస్‌బుక్, గూగుల్ సెర్చ్, ఇన్‌స్టా‌గ్రామ్, వికీపీడియా, యూట్యూబ్, గూగుల్ ట్రెండ్స్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై ఆయా నేతల ప్రజెన్స్ ను లెక్కగట్టి వారి బ్రాండ్ విలువను నిర్ధారిస్తుంది. ఇందులో భాగంగా 100 మిలియన్లకుపైగా ఆన్‌లైన్ ఇంప్రెషన్స్‌ను లెక్కగట్టింది.


చెక్‌బ్రాండ్(CheckBrand) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరానికి గాను మోదీ బ్రాండ్ విలువ(Modi Brand Value) రూ. 413 కోట్లుగా పేర్కొంది. 2020లో చివరిసారి వెల్లడించిన బ్రాండ్ వాల్యూ(Brand Value)తో పోలిస్తే ఇది రూ.86 కోట్లు అధికం. అక్టోబరు 2020లో పూర్తయిన చెక్‌బ్రాండ్ ప్రాథమిక మూల్యాంకనం మోదీని అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిగా నిర్ధారించింది. ఆయనకు సంబంధించిన దాదాపు 100 ట్రెండ్‌లు ప్రజా‌క్షేత్రంలో తిరుగుతున్నట్టు తెలిపింది. 2020 రెండో త్రైమాసికంలో చేసిన ఈ అధ్యయనంలో  అగ్రశ్రేణికి చెందిన 95మంది రాజకీయ ప్రముఖులతో పాటు 500 మంది ప్రముఖ వ్యక్తులను చేర్చింది. 


చెక్‌బ్రాండ్(CheckBrand) ప్రకారం.. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి 10 కోట్ల డేటాను డీకోడ్ చేసింది. ప్రధాని మోదీ 2020లో 70శాతం బ్రాండ్ స్కోర్, 327 కోట్ల డిజిటల్ బ్రాండ్ విలువ(Brand Value)ను స్కోర్ చేశారు. ఆ తర్వాతి నుంచి మోదీ బ్రాండ్ విలువ(Modi Brand Value) గణనీయంగా పెరిగింది. సాగు చట్టాల (ప్రస్తుతం రద్దు చేశారు) కారణంగా సోషల్ మీడియా గ్రూపులలో మోదీ కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ దానిని మోదీ అసాధారణంగా ఎదుర్కోగలిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2020లో వచ్చిన స్థానాన్నే ఇంకా కొనసాగిస్తున్నారు. చెక్‌బ్రాండ్(CheckBrand) రాజకీయ కేటలాగ్‌లో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. 2020తో పోలిస్తే ఆయన బ్రాండ్ విలువ కొంత పెరిగింది. అప్పట్లో రూ. 88.2 కోట్లుగా ఉన్న షా బ్రాండ్ విలువ ప్రస్తుతం రూ. 96.8 కోట్లుగా ఉన్నట్టు చెక్‌బ్రాండ్ తెలిపింది.  


అమిత్ షాకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విట్టర్‌లో ఈ సంఖ్య 30 మిలియన్లకు పైనే ఉంది. షా తర్వాతి స్థానంలో ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. 2020లో రూ.61.7 కోట్లుగా ఉన్న ఆయన బ్రాండ్ విలువ ఇప్పుడు రూ. 72.3కోట్లకు చేరింది. తక్కువ వ్యవధిలో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత డిజిటల్ ఫ్లాట్‌పామ్స్‌లో ఆయన చర్చ సర్వసాధారణం అయిపోయింది. కేజ్రీవాల్‌కు ట్విట్టర్‌లో 26.1 మిలియన్ ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో 9.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. 2020లో కేజ్రీవాల్ బ్రాండ్ విలువ రూ. 61.7 కోట్ల ఉంది. 


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ గణాంకాలలో కొంత దిగజారారు.  వివాదాలకు కేంద్రంగా మారిన రాహుల్ గత కొంతకాలంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి బలమైన అభ్యర్థులుగా మారిన నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, ప్రియాంక గాంధీల ఆన్‌లైన్ ఉనికిని కూడా చెక్‌బ్రాండ్ నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ బ్రాండ్ విలువ రూ. 23.7 కోట్లుగా ఉంది. పొలిటీషియన్స్ కేటలాగ్‌లో ప్రియాంక గాంధీ 13వ స్థానంలో నిలిచారు. యూపీ ఎన్నికల సమయంలో మహిళా సాధికారత గురించి ఆమె మాట్లాడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇక, నితీశ్ కుమార్ బ్రాండ్ వాల్యూ రూ.18.91 కోట్లుగా ఉంది. నటులు, రాజకీయవేత్తలు, బ్రాండ్లు, సీఈవోలు, సీఎంలు, క్రికెటర్లు తదితరులు చెక్‌బ్రాండ్(CheckBrand) వాల్యూ జాబితాలో మోదీ ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచారు. 

Updated Date - 2022-10-02T01:06:33+05:30 IST