పీఎం ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లతో ఉపాధి

ABN , First Publish Date - 2021-01-21T05:04:19+05:30 IST

ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రోఫుడ్‌ ప్రొసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్కీమ్‌(పీఎంఎఫ్‌ఎంఈ) ద్వారా ఉపాధి అవకాశాలు

పీఎం ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లతో ఉపాధి
పథకాల బ్రోచర్‌ను విడుదల చేస్తున్న చైర్మన్‌, ప్రతినిధులు

ఎంఎస్‌ఎంఈసీసీ చైర్మన్‌ దేవరాజ్‌ 

నెల్లూరులో లాంఛనంగా పథకం ప్రారంభం


నెల్లూరు(వైద్యం), జనవరి 20 : ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రోఫుడ్‌ ప్రొసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్కీమ్‌(పీఎంఎఫ్‌ఎంఈ) ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని మానిఫాక్చరర్‌ సర్వీస్‌ మార్కెటింగ్‌ ఎంటర్‌ప్రెన్సూర్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎంఎస్‌ఎంఈసీసీ) నేషనల్‌ చైర్మన్‌ దాసరి దేవరాజ్‌ వెల్లడించారు. నెల్లూరు నవాబుపేటలోని ఎంఎస్‌ఎంఈసీసీ కార్యాలయంలో అత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పఽథకంలో భాగంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ స్కీమ్‌ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌, వెజిటబుల్‌ ప్రాసెసింగ్‌, స్పైసెస్‌ ప్రాసెసింగ్‌, మీట్‌ ప్రాసెసింగ్‌, సిట్రస్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటివి జాబితాలో ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టులకు రూ.10 లక్షల పెట్టుబడి అవసరం ఉంటుందని, ప్రాజెక్టు వ్యయ్యాన్ని బట్టి కేంద్రం 35 శాతం సబ్సిడీ, 10 శాతం మార్జిన్‌ మనీ, 20 శాతం వర్కింగ్‌ క్యాపిటల్‌ ఉంటుందని తెలియచేశారు. జిల్లా వ్యాప్తంగా ఔత్సాహకులు ముందుకు వచ్చి ఈ పఽథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పఽథకాల బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈసీసీ జిల్లా కో ఆర్డినేటర్‌ చక్రపాణి, జయరాజ్‌, కిషోర్‌, జన్నయ్య తదతరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:04:19+05:30 IST