పీఎం కేర్స్‌ నిధుల్లో ఖర్చు పెట్టింది 36 శాతం...

ABN , First Publish Date - 2022-02-08T07:57:17+05:30 IST

పీఎం కేర్స్‌ స్కీమ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించిన నిధుల్లో

పీఎం కేర్స్‌ నిధుల్లో ఖర్చు పెట్టింది 36 శాతం...

  • మొదటి ఏడాది జమ అయిన మొత్తం రూ.10,990 కోట్లు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: పీఎం కేర్స్‌ స్కీమ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించిన నిధుల్లో 36 శాతం మాత్రమే ఖర్చయ్యాయి. పీఎం కేర్స్‌ ప్రారంభమైన 2020 మార్చి 27 నుంచి 2021 మార్చి 31 వరకు మొత్తం రూ.10,990 కోట్లు ఈ నిధికి జమయ్యాయి. ఇందులో గతేడాది మార్చి నాటికి కేంద్రం రూ.3,976 కోట్లు ఖర్చు చేసింది. 6.6 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు కొనుగోలు చేయడానికి రూ.1,392 కోట్లు వెచ్చించారు. అలాగే రూ.1,311 కోట్లు ఖర్చు చేసి దేశీయంగా తయారైన 50వేల వెంటిలేటర్లు కొన్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌లను ఏర్పాటుచేయడానికి, ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెస్టింగ్‌ ల్యాబ్‌లను అప్‌గ్రేడ్‌ చేయడానికి మిగతా మొత్తాన్ని వినియోగించారు. ఇవిపోగా మార్చి 2021 నాటికి ఇంకా రూ.7,014 కోట్లు పీఎం కేర్స్‌ నిధిలో ఉన్నాయి. ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్‌డీటీవీ ఈ విషయాలను వెల్లడించింది.

Updated Date - 2022-02-08T07:57:17+05:30 IST