చనిపోయిన 5 నెలల తర్వాత ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో రూ.75 వేలు జమ.. అసలు సంగతి తెలిసి అవాక్కైన కుటుంబసభ్యులు

ABN , First Publish Date - 2021-10-06T06:20:42+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని హర్దీ గ్రామానికి చెందిన దేవి సింగ్ బ్యాంక్ అకౌంట్‌లో ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు 75 వేల రూపాయలు వచ్చాయి. కానీ అయిదు నెలల ముందే దేవి సింగ్ మరణించాడు...

చనిపోయిన 5 నెలల తర్వాత ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో రూ.75 వేలు జమ.. అసలు సంగతి తెలిసి అవాక్కైన కుటుంబసభ్యులు

ఛత్తీస్‌గఢ్‌లోని హర్దీ గ్రామానికి చెందిన దేవి సింగ్ బ్యాంక్ అకౌంట్‌లో ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు 75 వేల రూపాయలు వచ్చాయి. కానీ అయిదు నెలల ముందే దేవి సింగ్ మరణించాడు. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉన్నట్లు దేవి సింగ్ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. 


దేవి సింగ్ అకౌంట్‌ నుంచి ఆ డబ్బులు మాయమయ్యాయి. ఆ డబ్బుతో ఆన్‌లైన్ ద్వారా బంగారం ఎవరో బంగారం కొన్నారని తెలిసింది. ఆ డబ్బులతో దేవి సింగ్ ఇల్లు కట్టుకోలేదు కనుక అతని ఇంటికి ప్రభుత్వం నోటీసులు పంపించింది. దీంతో దేవి సింగ్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఏదో మోసం జరిగిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసింది. కొందరు సైబర్ నేరగాళ్లు దేవి సింగ్ అకౌంట్ నుంచి UPI ట్రాన్సాక్షన్ ద్వారా సెప్టంబర్ 2021లో ఆ బంగారం కొన్నారు.  దేవి సింగ్ పేరుతో మరో సిం కార్డు కూడా ఉందని, అది ఆయన బ్రతికున్నప్పుడే యాక్టివేట్ అయ్యిందని పోలీసుల విచారణలో తేలింది. 


టికం కుమార్ అలియాస్ టిల్లు అనే సైబర్ దొంగ ఈ కేసులో మాస్టర్‌మైండ్ అని పోలీసులు చెప్పారు.  అతను ఇలాంటి దొంగతనం ఒడిశా కూడా చేశాడని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Updated Date - 2021-10-06T06:20:42+05:30 IST