మాజీ మంత్రి తల మీద విగ్గు పీకితే రూ. 50 వేలు బహుమతి

ABN , First Publish Date - 2022-05-03T08:52:57+05:30 IST

ఒక మాజీ మంత్రి తల మీద విగ్గు పీకి దానిని తెచ్చి ఇస్తే రూ.50,000 నగదు బహుమతి ఇస్తామని దేశ ప్రధాని ప్రత్యేక సహాయకుడు ప్రకటించాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఈ ప్రకటన చేసింది పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి సహాయకుడు...

మాజీ మంత్రి తల మీద విగ్గు పీకితే రూ. 50 వేలు బహుమతి

ఒక మాజీ మంత్రి తల మీద విగ్గు పీకి దానిని తెచ్చి ఇస్తే రూ.50,000 నగదు బహుమతి ఇస్తామని దేశ ప్రధాని ప్రత్యేక సహాయకుడు ప్రకటించాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఈ ప్రకటన చేసింది పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి సహాయకుడు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ -నవాజ్ పార్టీ నాయకుడు హనీఫ్ అబ్బాసీ. 


వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ కొత్త మంత్రులు మరియమ్ ఔరంగజేబ్, షాజేన్ బుగ్తీ మరికొందరు ప్రభుత్వ అధికారులతో కలిసి ఇటీవల సౌదీ అరేబియాలోని పవిత్ర మదీనా మసీదుకు వెళ్లారు. అక్కడ నివసించే కొందరు పాకిస్తాన్ జాతీయులు కొత్త మంత్రులకు రాకను నిరసిస్తూ వారు దొంగలుగా సంబోధించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.


ఈ ఘటనని ఖండిస్తూ ప్రధాన మంత్రి ప్రత్యేక సహాయకుడు హనీఫ్ అబ్బాసి ఒక ప్రెస్ కాన్ఫెరెన్స్ చేశారు. మదీనా మసీదులో మంత్రులకు అవమానం జరిగిందని.. ఇదంతా పథకం ప్రకారం మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, మరో మాజీ మంత్రి షేక్ రాషిద్ చేయించారని హనీఫ్ ఆరోపణలు చేశారు.


ఈ అవమానానికి బదులుగా.. మాజీ మంత్రి షేక్ రాషిద్ తలపై ఉన్న నకిలీ జుట్టును ఎవరైనా పీకి.. తీసుకువస్తే వారికి రూ.50 వేలు బహుమతి ఇస్తామని హనీఫ్ అబ్బాసి ప్రకటించారు.


Read more