Abn logo
Sep 21 2021 @ 11:18AM

ప్లస్‌ టూ మార్కుల ఆధారంగా వైద్యకోర్సుల అడ్మిషన్లు

                - ఏకే రాజన్‌ కమిటీ సిఫారసు


చెన్నై: వైద్య కోర్సుల్లో ప్లస్‌ టూ మార్కుల ఆధారంగా అడ్మిష న్లు చేపట్టాలని జస్టిస్‌ ఏకే రాజన్‌ కమిటీ ప్రభు త్వానికి సిఫారసు చేసింది. వైద్యకోర్సుల ప్రవేశం కోసం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నీట్‌’ పరీక్ష తో బెంబేలెత్తుతున్న రాష్ట్ర విద్యార్థులు ఆత్మహత్య లకు ఒడిగడుతున్న నేపథ్యంలో ఆ పరీక్ష ఆవశ్యకత, దానికి ప్రత్యామ్నాయం, సమస్యలపై అధ్యయనం, పరిష్కారాల అన్వేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే రాజన్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల అభిప్రాయాలను సేకరించి రూపొందించిన నివేదికను సోమవారం సీఎం స్టాలిన్‌కు అందజేసింది. నీట్‌ పరీక్ష రద్దుకు చట్టపరంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి రాష్ట్రపతికి పంపించాలని సిఫారసు చేసింది. అలాగే, వైద్యకోర్సుల ప్రవేశాన్ని ప్లస్‌ టూ మార్కుల ఆధారంగా చేపట్టాలని, అప్పుడే విద్యార్థులకు సామాజిక న్యాయం ప్రతిఫలిస్తుందని జస్టిస్‌ రాజన్‌ కమిటీ సూచించింది.