Kerala: లింగ సమానత్వం దిశగా మరో పాఠశాల ముందడుగు

ABN , First Publish Date - 2021-12-15T18:22:35+05:30 IST

కేరళలోని..

Kerala: లింగ సమానత్వం దిశగా మరో పాఠశాల ముందడుగు

కోజికోడ్: కేరళలోని ఎర్నాకులం జిల్లా వలయన్చిరంగార ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరూ ఒకేరకమైన యూనిఫామ్‌ను ధరించి తరగతులకు హాజరవుతున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఈ జాబితాలోకి మరో పాఠశాల చేరిపోయింది. కోజికోడ్ జిల్లా బలుస్సేరిలోని ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాలలో దాదాపుగా 200 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులందరూ బుధవారం ఫుల్ షర్ట్, ప్యాంటు ధరించి తరగతులకు హాజరయ్యారు. అయితే కొంతమంది విద్యార్థినులు మాత్రం షర్ట్స్ పైన చున్నీ వేసుకొని వచ్చారు.


ఈ పాఠశాలకు చెందిన ఇందూ అర్ అనే ప్రధానోపాధ్యాయురాలు ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. లింగ సమానత్వం దిశగా మన పాఠశాలలో కూడా ఒకేరకమైన యూనిఫామ్‌ను అమలు చేయాలనుకుంటున్నామని, దీనికి మీ, మీ తల్లిదండ్రలు అభిప్రాయం కావాలని కోరారు. ఈ ఆలోచన నచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఒకేరకమైన యూనిఫామ్‌కు సమ్మతి తెలిపారు. శివానంద అనే విద్యార్థిని మాట్లాడుతూ తాము ఈ మార్పును స్వాగతిస్తున్నామని, ముఖ్యంగా ఏదైనా క్రీడలలో పాల్గొనాలనుకునేవారికి ఈ డ్రస్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పింది. మరో విద్యార్థిని లుత్సియా జియాన్ మాట్లాడుతూ లింగ సమానత్వం దిశగా తీసుకున్న ఈ చర్యపట్ల తమ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారని, చొక్కా, ప్యాంటు ధరించడం ఎంతో సౌకర్యవంతంగా ఉందని చెప్పింది.  

Updated Date - 2021-12-15T18:22:35+05:30 IST