ప్లస్‌ వన్‌ పరీక్షలు అనుమానమే?

ABN , First Publish Date - 2022-02-05T15:32:42+05:30 IST

రెండేళ్ల నుంచి సరైన పరీక్షలు జరగకపోవడం, ఇప్పటి వరకూ తగిన సిల్బస్‌పై సరైన పోర్షన్‌ వెల్లడించకపోవడం తది తరాల నేపథ్యంలో ఈ ఏడాది కూడా ప్లస్‌ వన్‌ పరీక్షలు నిర్వహించకుండానే ‘ఆల్‌ పాస్‌’ చేసే అంశంపై అధికారులు తర్జ

ప్లస్‌ వన్‌ పరీక్షలు అనుమానమే?

                                - విద్యార్థుల లాభనష్టాలపై నిపుణుల తర్జనభర్జన


పెరంబూర్‌(చెన్నై): రెండేళ్ల నుంచి సరైన పరీక్షలు జరగకపోవడం, ఇప్పటి వరకూ తగిన సిల్బస్‌పై సరైన పోర్షన్‌ వెల్లడించకపోవడం తది తరాల నేపథ్యంలో ఈ ఏడాది కూడా ప్లస్‌ వన్‌ పరీక్షలు నిర్వహించకుండానే ‘ఆల్‌ పాస్‌’ చేసే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ నిర్ణయం విద్యార్థులకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అన్నదానిపై వారు నిపుణులతో చర్చిస్తున్నారు. పబ్లిక్‌ పరీక్షలకు వెళ్లే పది, ప్లస్‌ వన్‌ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తుండడంతో ప్లస్‌ వన్‌ విద్యార్థులకు తగిన న్యాయం చేయలేకపోతున్నామనే భావన ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతుండడంతో అధికారులు ఈ దిశగా యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర పాఠ్యప్రణాళికలో చదువుతున్న పది, ప్లస్‌ టూ విద్యార్థులకు గత సెప్టెంబరు 1 నుంచి నేరుగా తరగతులు నిర్వహించగా, కరోనా మూడో అల వ్యాప్తి కారణంగా డిసెంబరు 23 నుంచి గత నెల 31వ తేది వరకు సెలవులు ప్రకటించారు. అనం తరం లాక్‌డౌన్‌ సడలింపులతో మంగళవారం నుంచి పాఠశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ, కరోనా వ్యాప్తి, పాఠశాలల్లో కఠిన నిబంధనల మధ్య విద్యార్థులను గ్రూపులుగా విభజించి 50 శాతం మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో గ్రూపు విద్యార్థులకు రెండు గంటలు మాత్రమే తరగ తులు జరుగుతున్నాయి. ప్లస్‌ టూ విద్యార్థులకు తగ్గించిన పాఠ్యప్రణాళికలోని పాఠాలు బోధించేందుకు కనీసం మూడు నెలలు పడుతుంది. దీంతో, ప్లస్‌ టూ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ తరగతులు నిర్వహిస్తుండడంతో, ప్లస్‌ వన్‌ విద్యార్థులకు సక్రమం గా బోధన సాగడం లేదని ఉపాధ్యాయులు వాపోతు న్నారు. అదే సమయంలో, పాఠశాల విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ‘సిలబస్‌ షెడ్యూల్‌’లో ప్లస్‌ వన్‌ పోర్షన్‌ లేదు. ప్రస్తుత ప్లస్‌ వన్‌ విద్యార్థులు గత ఏడాది 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాయకుండా ‘ఆల్‌ పాస్‌’ విధానంలో ఉత్తీర్ణులయ్యారు. అంతకు ముందు 9వ తరగతి పరీక్షలు కూడా వారు రాయలేదు. మూడేళ్లుగా వార్షిక పరీక్షలు రాయని ప్రస్తుత ప్లస్‌ వన్‌ విద్యార్థులకు ఒక్కసారిగా పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తే, విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక సరిగ్గా మార్కులు కూడా సాధించలేరని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితులు పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది ప్లస్‌ వన్‌ తరగతులకు ‘ఆల్‌ పాస్‌’ ప్రకటించడమా లేక జిల్లా స్థాయిలో మాత్రమే పరీక్షలు నిర్వహించాలా అన్నదానిపై ఉన్నతాధికారులు సమాలోచన చేస్తున్నారని తెలిపా రు. అదే సమయంలో ప్లస్‌ వన్‌ పాఠాలు చదవకుండా ఉన్నత విద్యకు వెళ్తే వారిలో ప్రతిభ తగ్గే అవకాశం కూడా ఉందన్నారు. ఈ విషయమై గత వారం సచివాలయం, పరీక్ష శాఖలు నిర్వహించిన సమావేశంలో చర్చించామని, విద్యా నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అధికారుల అభిప్రాయాలు తెలుసుకొని నివేదిక తయారుచేసి, ముఖ్యమంత్రి, పాఠశాల విద్యాశాఖ మంత్రి అందజేయ నున్నట్లు ఆయన తెలిపారు.

 

పరీక్షల రద్దు తగదు

ప్లస్‌ వన్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దుచేయరాదని ప్రైవేటు పాఠశాలల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందకుమార్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్లస్‌ వన్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా ‘ఆల్‌ పాస్‌’ ప్రకటించే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలు ప్లస్‌ వన్‌ విద్యార్థులకు నిర్ణీత సమయంలో సిలబస్‌ ముగించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో, పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, వారి ఉన్నత విద్య ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. అందువల్ల ఆల్‌ పాస్‌ విధానం అమలుచేయకుండా పరీక్షలు నిర్వహించాలని నందకుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-02-05T15:32:42+05:30 IST