మరిన్ని రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్‌

ABN , First Publish Date - 2020-10-31T06:49:23+05:30 IST

దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల

మరిన్ని  రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్‌

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ) మరిన్ని రంగాలకు విస్తరిస్తుందని, అలాగే స్వయం సమృద్ధి సాధన కోసం దేశీయ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మరింత సానుకూలమైన వాతావరణం కల్పిస్తుందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు.


దేశంలో ఈ-వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందన్నారు. రోడ్లపై నడిచే వాహనాల్లో 85 శాతం టూ వీలర్లు, త్రీ వీలర్లేనని, రాబోయే కాలంలో వాటిని ఎలక్ర్టిక్‌ వాహనాలుగా మార్చేస్తామని చెప్పారు. అలాగే టూ వీలర్లు, త్రీ వీలర్లకు చార్జింగ్‌ ప్రమాణాలను కూడా ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు. 


Updated Date - 2020-10-31T06:49:23+05:30 IST