ప్రత్యేక స్టీల్‌ ఉత్పత్తికీ పీఎల్‌ఐ

ABN , First Publish Date - 2021-07-23T05:42:03+05:30 IST

దేశంలో ప్రత్యేక స్టీలు ఉత్పత్తిని పోత్సహించే చర్యలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకు

ప్రత్యేక స్టీల్‌ ఉత్పత్తికీ పీఎల్‌ఐ

దేశంలో ప్రత్యేక స్టీలు ఉత్పత్తిని పోత్సహించే చర్యలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకు ముందుకు వచ్చే కంపెనీలకు వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద రూ.6,322 కోట్ల రాయితీలు అందించేందుకు ఆమోదముద్ర వేసింది. దీనివల్ల ఈ రంగంలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు, 2.5 కోట్ల టన్నుల ప్రత్యేక స్టీల్‌ ఉత్పత్తి సామర్ధ్యం, 5.25 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని అంచనా. కాగా ఎఫ్‌డీఐ ద్వారా రూ.15,000 కోట్ల వరకు సమీకరించేందుకు అనుమతించాలన్న వొడాఫోన్‌ ఐడియా ప్రతిపాదనకూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 


Updated Date - 2021-07-23T05:42:03+05:30 IST