క్యాల్షియం పుష్కలం

ABN , First Publish Date - 2022-10-04T05:30:00+05:30 IST

క్యాల్షియం కోసం పాల ఉత్పత్తుల మీదే ఆధారపడవలసిన అవసరం లేదు. ‘లాక్టోజ్‌ ఇంటాలరెన్స్‌’ లాంటి పాలను పూర్తిగా జీర్ణం చేసుకోలేని సమస్య ఉన్నవాళ్లు, వేగన్లు క్యాల్షియం కోసం ఇవిగో ఈ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు.

క్యాల్షియం పుష్కలం

క్యాల్షియం కోసం పాల ఉత్పత్తుల మీదే ఆధారపడవలసిన అవసరం లేదు. ‘లాక్టోజ్‌ ఇంటాలరెన్స్‌’ లాంటి పాలను పూర్తిగా జీర్ణం చేసుకోలేని సమస్య ఉన్నవాళ్లు, వేగన్లు క్యాల్షియం కోసం ఇవిగో ఈ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు. 


షియా: రెండు టేబుల్‌స్పూన్ల షియా విత్తనాల్లో 179 మి.గ్రా క్యాల్షియం ఉంటుంది. ఈ విత్తనాల్లో ఉండే ‘బోరాన్‌’, క్యాల్షియం, ఫాస్ఫరస్‌; మెగ్నీషియంలను శరీరం శోషించుకునే సామర్ధ్యాన్ని పెంచి, ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. కాబట్టి స్మూదీలు, ఓట్‌మీల్‌ లేదా పెరుగుతో కలిపి షియా సీడ్స్‌ తీసుకోవచ్చు.


సోయా పాలు: ఒక కప్పు సోయా పాలలో, అంతే పరిమాణంలోని ఆవు పాలతో సమానమైన క్యాల్షియం ఉంటుంది. అయితే క్యాల్షియం ఫోర్టిఫైడ్‌ అనే లేబుల్‌ ఉన్న సోయా పాలనే ఎంచుకోవాలి. 


బాదం: ఒక కప్పు బాదం పప్పులో 385 మి.గ్రా క్యాల్షియం ఉంటుంది. ఒక రోజులో తీసుకోవలసిన క్యాల్షియంలో ఇది మూడవ వంతు. అయితే ఇంతే పరిమాణంలోని బాదం పప్పులో 72 గ్రాముల కొవ్వు కూడా ఉంటుంది. కాబట్టి క్యాలరీల సంఖ్యను తగ్గించుకోవడం కోసం, పావు కప్పుకే పరిమితం కావాలి.


అంజీర్‌: 8 ఎండిన అంజీర్‌లో 241 మి.గ్రా క్యాల్షియం ఉంటుంది. దీన్లో పీచు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ కాబట్టి మిడ్‌డే స్నాక్‌గా తినొచ్చు.

Updated Date - 2022-10-04T05:30:00+05:30 IST