ఫ్లీట్‌ చేయండిక!

ABN , First Publish Date - 2020-06-13T05:43:23+05:30 IST

ట్విట్టర్‌ వినియోగదారులకు ‘ఫ్లీట్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ రూపొందించిన ఈ ఫీచర్‌ ఇకపై ట్విట్టర్‌లోనూ కనిపించనుంది. దీంతో వినియోగదారులు చేసే పోస్టులు 24 గంటలు మాత్రమే కనిపించనున్నాయి. ఆ తరువాత వాటికవే కనిపించకుండా పోతాయి...

ఫ్లీట్‌ చేయండిక!

ట్విట్టర్‌ వినియోగదారులకు ‘ఫ్లీట్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ రూపొందించిన ఈ ఫీచర్‌ ఇకపై ట్విట్టర్‌లోనూ కనిపించనుంది.  దీంతో వినియోగదారులు చేసే పోస్టులు 24 గంటలు మాత్రమే కనిపించనున్నాయి. ఆ తరువాత వాటికవే కనిపించకుండా పోతాయి. ట్వీట్‌, ఫోటో, వీడియో ఏదైనా ప్రొఫైల్‌లో 24 గంటలు మాత్రమే ఉంటుంది. ట్వీట్‌ మాదిరిగా శాశ్వతంగా ఉండదు. ఫ్లీట్‌కు లైక్‌లు, కామెంట్లు, షేర్‌ చేయడం వంటి ఆప్షన్లు ఉండవు. అనవసరమైన కామెంట్లు వస్తాయేమోనన్న బెంగ అవసరం లేదు. విదేశాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ ఇకముందు ఇండియాలోనూ తీసుకురావాలని ట్విట్టర్‌ నిర్ణయించింది.


ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌లో ఈ ఫీచర్‌ ఇప్పటికే ఉంది. మీరు చేసిన ఫ్లీట్‌లను మీ ఫాలోవర్స్‌ వాళ్ల హోమ్‌ టైమ్‌లైన్‌లో చూడొచ్చు. ఎవరైనా కూడా ఫుల్‌ ప్రొఫైల్‌కు వెళ్లడం ద్వారా అక్కడున్న ఫ్లీట్స్‌ చూడొచ్చు. మీ ఫాలోవర్లు మాత్రమే మీ ఫ్రొఫైల్‌ ఫొటోపై క్లిక్‌ చేయడం ద్వారా ఫ్లీట్స్‌ చూసే వీలుంటుంది. ‘అప్‌డేట్‌ ట్విట్టర్‌ యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు.


Updated Date - 2020-06-13T05:43:23+05:30 IST